Kukunoor: మాధవరం, దాచారం పంచాయతీల్లో వైసీపీ మద్దతుతో సీపీఎం నామినేషన్లు!

Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలోని మాధవరం, దాచారం పంచాయతీల్లో వైసీపీ మద్దతుతో ముగ్గురు సీపీఎం వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 16 Nov 2026 4:06 PM IST
Kukunoor
X

Kukunoor: మాధవరం, దాచారం పంచాయతీల్లో వైసీపీ మద్దతుతో సీపీఎం నామినేషన్లు!

కుక్కునూరు: మండలంలోని మాధవరం, దాచారం గ్రామ పంచాయతీల్లో వైసీపీ, సీపీఎం పార్టీల మద్దతుతో ముగ్గురు వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాధవరం నాలుగో వార్డుకు సరియం హరినాథ్, ఎనిమిదో వార్డుకు మేడిపల్లి బాబు, దాచారం మొదటి వార్డుకు పట్ల సీతమ్మ నామినేషన్లు సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ.. పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రజల పక్షాన నిలిచే సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మరింత విస్తృతంగా పోరాటం చేస్తారని పేర్కొన్నారు.

పాలక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు షేక్ వలీపాషా, కోట మోహన్ రావు, పట్ల లక్ష్మయ్య, పూలదాసు రమేష్, భవాని, మిడియం సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR