Kukunoor: ఎస్‌ఐఆర్ విధానాన్ని రద్దు చేయాలి: కుక్కునూరులో వామపక్షాల ధర్నా
Kukunoor: ఓట్ల తొలగింపునకు దారితీసే ఎస్‌ఐఆర్ (SIR) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.
Kukunoor: ఎస్‌ఐఆర్ విధానాన్ని రద్దు చేయాలి: కుక్కునూరులో వామపక్షాల ధర్నా
కుక్కునూరు: ఓట్ల తొలగింపునకు అవకాశం కల్పించేలా ఉన్న ఎస్‌ఐఆర్ (SIR) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపడుతోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య, కురాకుల బాబురావు, సోడే నాగేష్, ఎకో సోమరాజు, మడకం ఉంగ, సోడే మారయ్య, సతీష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు, మండల కార్యదర్శి యర్ణం సాయికిరణ్, ఎస్కే వలీపాషా, మేడిపల్లి బాబు, రమేష్, పొట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




