Kukunoor: పెదరాయిగూడెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
Kukunoor: కుక్కునూరు మండలం పెదరాయిగూడెంలో అంగన్వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించిన బీజేపీ నేతలు.
Kukunoor: పెదరాయిగూడెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
కుక్కునూరు: మండల పరిధిలోని పెదరాయిగూడెం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు కె.వి.ఎన్. దొర, ప్రధాన కార్యదర్శి మైసాక్షి రామాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారుల పోషణ, ఆరోగ్య సంరక్షణలో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కె.వి.ఎన్. దొర మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో మాతా శిశు సంక్షేమం, మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి చిన్నారికి, తల్లికి పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, తల్లులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




