Kukkunuru: జాతీయ కరాటే పోటీల్లో కుక్కునూరు శ్లోక స్కూల్ విద్యార్థుల ప్రతిభ!
Kukkunuru: ఖమ్మంలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీల్లో పతకాలు సాధించిన కుక్కునూరు శ్లోక కాన్సెప్ట్ స్కూల్ 19 మంది విద్యార్థులు.
Kukkunuru: జాతీయ కరాటే పోటీల్లో కుక్కునూరు శ్లోక స్కూల్ విద్యార్థుల ప్రతిభ!
Kukkunuru: ఖమ్మం నగరంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీల్లో కుక్కునూరు శ్లోక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, ప్రతి ఒక్కరూ పతకం సాధించి సత్తా చాటారు.
సుమన్ షాటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డూ అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. కరాటే కోచ్ సెవెన్త్ డాన్ ముత్తు శిక్షణలో, పీఈటీ సుబ్బు ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ విజయాన్ని సాధించారు.
విద్యార్థుల ప్రతిభపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు. జాతీయ స్థాయిలో కుక్కునూరు విద్యార్థులు ప్రతిభ చాటడం మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు.




