Kukkunuru: మాధవరం ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థి గెలుపునకు ప్రచారం!

Kukkunuru: మాధవరం ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థి సోడే బాలరాజుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని యర్నం సాయికిరణ్ విజ్ఞప్తి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 27 Oct 2026 4:33 PM IST
Kukkunuru
X

Kukkunuru: మాధవరం ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థి గెలుపునకు ప్రచారం!

కుక్కునూరు: మండల పరిధిలోని మాధవరం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి సోడే బాలరాజు గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, గ్రామ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను వివరిస్తూ బాలరాజుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి నాగేందర్రావు మాట్లాడుతూ కొత్తూరు, కౌండిన్యముక్తి, మర్రిపాడు, మాధవరం గ్రామాల నిర్వాసితులకు కాంటూరుతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించాలని పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు. మర్రిపాడు ఆర్‌&ఆర్‌ కాలనీలో నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లను చింతూరు నిర్వాసితులకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసం సీపీఎం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మాధవరం ఎంపీటీసీ అభ్యర్థి సోడే బాలరాజును సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ ప్రచారంలో అభ్యర్థి సోడే బాలరాజుతో పాటు నాయకులు మేడిపల్లి బాబు, కోట మోహన్‌రావు, షేక్ వలీ పాషా, సరియ హరినాథ్, భవాని, సోడే సత్యవతి, పులదాసు రమేష్, ఊకె ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR