Kukkunoor: కుక్కునూరు-1 ఎంపీటీసీ బరిలో కూటమి అభ్యర్థి పిచ్చుక రాజు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు-1 ఎంపీటీసీ కూటమి అభ్యర్థి పిచ్చుక రాజు ముమ్మర ఇంటింటి ప్రచారం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఓటర్లను నేరుగా కలుస్తూ మద్దతు అభ్యర్థన.
Kukkunoor: కుక్కునూరు-1 ఎంపీటీసీ బరిలో కూటమి అభ్యర్థి పిచ్చుక రాజు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కుక్కునూరు–1 ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన పిచ్చుక రాజు మంగళవారం కుక్కునూరు లోకల్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరావు , జనసేన అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్‌తో కలిసి స్థానిక ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తన అభ్యర్థిత్వాన్ని వివరించి, ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుక్కునూరు మండలంలో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కుక్కునూరు–1 ఎంపీటీసీ అభ్యర్థి పిచ్చుక రాజు చేపట్టిన ప్రచారం స్థానికంగా రాజకీయ సందడిని నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




