Eluru: నూజివీడు మండలం అన్నవరంలో కూటమి ఇంటింటి ఎన్నికల ప్రచారం!

Eluru: ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో ఎంపీపీ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఇంటింటి ఎన్నికల ప్రచారం జరిగింది.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 29 Nov 2026 8:57 AM IST
Eluru
X

Eluru: నూజివీడు మండలం అన్నవరంలో కూటమి ఇంటింటి ఎన్నికల ప్రచారం!

Eluru: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండల ఎంపీపీ కాపా శ్రీనివాసరావు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.

కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరియు 12 మంది వార్డులో పోటీ చేసిన అభ్యర్థులను వెంటబెట్టుకుని గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండల అభివృద్ధికి నిరంతరం చేస్తున్న కృషిని గుర్తు చేశారు.అన్నవరం గ్రామంలో భవిష్యత్తులో చేపట్టబోయే మౌలిక సదుపాయాలు,అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులకు తెలియజేశారు.గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలందరూ తమ అమూల్యమైన మద్దతును తెలియజేయాలని కాపా శ్రీనివాసరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid