Koonavaram: కూనవరంలో ఉత్సాహంగా 9వ జాతీయ పోషణ మాసం, అంగన్‌వాడీ ఉత్సవ్

Koonavaram: కూనవరంలో 9వ జాతీయ పోషణ మాసం, అంగన్‌వాడీ ఉత్సవ్ వేడుకలు. గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించిన ఐసీడీఎస్ అధికారులు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 29 Sept 2026 4:58 PM IST
Koonavaram
X

Koonavaram: కూనవరంలో ఉత్సాహంగా 9వ జాతీయ పోషణ మాసం, అంగన్‌వాడీ ఉత్సవ్

కూనవరం: పోలవరం జిల్లా ICDS ప్రాజెక్ట్ కూనవరం నందు ప్రాజెక్ట్ అధికారిణి శ్రీమతి వి.మల్లిక ఆధ్వర్యంలో 9 వ జాతీయ పోషణ మాసం-2026,అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కూనవరం మండలం

టేకులబోర్ -2అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమం జరిగింది.మహిళల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో సీడీపీఓ వి.మల్లిక పిల్లలు ఆరోగ్యం,పోషణ,సమగ్రాభివృద్ధి,కేంద్రం ప్రభుత్వం పధకాలు PMMVY,మిషన్ వాత్సల్య,మిషన్ శక్తి,సాక్షం (అంగన్వాడీ ల అదునీకరణ ),పోషణ 2.0, కమ్యూనిటీ basad ఈవెంట్స్ మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించినారు.

గర్భిణీ స్త్రీ లకు సీమంతం నిర్వహించినారు.ఈ కార్యక్రమంకు సెక్టార్ సూపర్ వైజర్ A.నయోమి రాణి,తల్లులు,కిశోరి బాలికలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు,యూత్ కమిటీ సభ్యులు సెక్టార్ లోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR