Kukunoor: మాధవరంలో ప్రచారాన్ని ఉధృతం చేసిన కొండ్రు బాబూరావు!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మాధవరం పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థి కొండ్రు బాబూరావు రాత్రివేళ ముమ్మర ఎన్నికల ప్రచారం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 31 Oct 2026 9:44 AM IST
Kukunoor
X

Kukunoor: మాధవరంలో ప్రచారాన్ని ఉధృతం చేసిన కొండ్రు బాబూరావు!

Kukunoor: మండల పరిధిలోని మాధవరం గ్రామ పంచాయతీలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. ఎంపీటీసీ అభ్యర్థి కొండ్రు బాబూరావు గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు.

గ్రామంలోని ప్రజలతో మమేకమవుతూ సాగిన కొండ్రు బాబూరావు ప్రచార కార్యక్రమంలో మాజీ వైసీపీ గ్రామ పంచాయతీ కన్వీనర్ గంజి రాజేష్ పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు, స్థానిక అంశాలపై చర్చిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

మాధవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రచార కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజి శ్రీను, గంజి వెంకట్రావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR