Eluru: కొల్లేరు వివరాలు వారం రోజుల్లో సమర్పించాలి: కాంతీలాల్ దండే!
Eluru: కొల్లేరు అభయారణ్య సరిహద్దుల హేతుబద్ధీకరణపై సుప్రీం కోర్టు కేంద్ర సాధికార కమిటీ కోరిన వివరాలను వారం రోజుల్లోగా పంపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే ఆదేశించారు.
Eluru: కొల్లేరు వివరాలు వారం రోజుల్లో సమర్పించాలి: కాంతీలాల్ దండే!
ఏలూరు: కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, భూముల వివరాలపై సుప్రీం కోర్ట్ కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజుల్లోగా సమర్పించాలని అటవీ,పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు.మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మరియు ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు పరిధిలోని జిరాయితీ,డి-ఫారం భూముల వివరాలు,మౌలిక సదుపాయాల మ్యాప్లు,బాధితుల పునరావాస ప్రణాళికలు మరియు పర్యావరణ ప్రభావాలపై నిపుణుల నివేదికలను సిద్ధం చేసి కేంద్ర కమిటీకి పంపాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల జాయింట్ కలెక్టర్లు,అటవీ,రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.




