Eluru: నూజివీడు ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన కాపా శ్రీనివాసరావు!
Eluru: నూజివీడు మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) నూతన అధ్యక్షులుగా కాపా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Eluru: నూజివీడు ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన కాపా శ్రీనివాసరావు!
Eluru: నూజివీడు మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) నూతన అధ్యక్షులుగా కాపా శ్రీనివాసరావు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా ఏర్పడిన తర్వాత నూజివీడుకు రెండవ ఎంపీపీగా ఎన్నికైన ఆయన,మండల పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాలు మరియు ప్రత్యేక పూజల మధ్య పాలనా బాధ్యతలను ప్రారంభించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూజివీడు మండలంలోని పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు మరియు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు సభ్యులకు,కూటమి నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




