Eluru: రామన్నగూడెంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు విస్తృత ప్రచారం!

Eluru: ఏలూరు జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంలో బోరువంచ ఎంపీటీసీ కూటమి అభ్యర్థి కాపా శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 8:27 AM IST
Eluru
X

Eluru: రామన్నగూడెంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు విస్తృత ప్రచారం!

Eluru: నూజివీడు మండలంలోని బోరువంచ ఎంపిటిసి సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు శుక్రవారంనాడు తన సెగ్మెంట్ పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాపా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకుంటూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు..తన సొంత గ్రామమైన రావిచర్లకు సరిహద్దునున్న బోరవంచ, రామన్నగూడెం,కొత్తూరు,కొన్నం గుంట గ్రామాలు తన స్వగ్రామంతో సమానమని తనను ఎంపీటీసీగా గెలిపించి మండల పరిషత్ కు పంపితే రావిచర్ల తరహా లోనే బోరువంచ ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు.

ఎంపీటీసీగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేయడంతో పాటు జడ్పిటిసి అభ్యర్థి సైతం సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్