Chintalapudi: కామవరపుకోటలో రూ.కోటితో సీసీ రోడ్లకు శంకుస్థాపన

Chintalapudi: కామవరపుకోట మండలం కేఎస్ రామవరం, దొండపాటివారిగూడెంలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2026 7:25 PM IST
Chintalapudi
X

Chintalapudi: కామవరపుకోటలో రూ.కోటితో సీసీ రోడ్లకు శంకుస్థాపన

Chintalapudi: చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం కేఎస్ రామవరం,దొండపాటి వారి గూడెం గ్రామాల్లో సంబరం నెలకొంది.స్వతంత్రం వచ్చాక ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారే తప్ప, మా గ్రామానికి ఎమ్మెల్యే రావడం ఇదే మొదటిసారి అంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కోటి రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు.గ్రామాల రూపురేఖలు మార్చేలా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తున్నామని,ఇది ఆరంభం మాత్రమేనని,రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్