Chinturu: శబరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Chinturu: శబరి నది ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు.
Chinturu: శబరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Chinturu: శబరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడంతో శబరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ కూనవరం వంతెన వద్ద శబరి నది ఉధృతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల లో కురిసిన భారీ వర్షాల కారణంగా శబరి నదిలో భారీగా నీరు చేరి చింతూరు ఏజెన్సీని వరద ముంచెత్తింది అన్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులు ముంపు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని అన్నారు.గోదావరి నదికి పెద్దగా వరద వచ్చే అవకాశం లేదని అన్నారు.
సోమవారం వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని వరద పై అధికారులు అలర్ట్ గా ఉండాలని అన్నారు.ముందస్తు చర్యలో భాగంగా ముంపు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పునరావాస కేంద్రాలలో బాధితులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.ఐటిడిఎ పీఓ శుభం నొక్వాల్ అందుబాటులో ఉంటూ వరద పరిస్థితి పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.




