Eluru: నిర్దేశించిన ధరలకే బియ్యం అమ్మాలి.. లేదంటే కఠిన చర్యలు!

Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Nov 2026 7:18 AM IST
Eluru
X

Eluru: నిర్దేశించిన ధరలకే బియ్యం అమ్మాలి.. లేదంటే కఠిన చర్యలు!

Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలని,అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు.

సోమవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ధరల నియంత్రణపై అధికారులు,వ్యాపారులు,రైతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిపిటి 3291 (సోనా),బిపిటి 5204 (సాంబ),కేఎన్ఎం రకాలు కిలో రూ.66,హెచ్‌ఎంటీ,ఆర్‌ఎన్‌ఆర్ రకాలు రూ.76, జైశ్రీరామ్ రూ.82, ఎంటీయూ కామన్ రకం రూ.47 చొప్పున మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు.

ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, ధరల ట్యాంపరింగ్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 64 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.బియ్యం వ్యాపారులు ప్రతి శుక్రవారం Food Stock Portalలో నిల్వల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

అక్రమ నిల్వలు,కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ బియ్యం ధరలు, నిల్వలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ బాబు విలియమ్స్,పౌర సరఫరాల సంస్థ అధికారి శివరామమూర్తి, ఉద్యానవన శాఖ డీడీ సాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్