Eluru: ఏలూరు జిల్లాలో ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల పర్యటన!

Eluru: ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించి, సాగు విధానాలపై అధ్యయనం చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Sept 2026 7:37 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల పర్యటన!

Eluru: ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం (APCNF) ఆధ్వర్యంలో జరుగుతున్న సాగు విధానాలను అధ్యయనం చేయడానికి ఇండోనేషియా(ఆస్టుంగ్‌కారావే),థాయిలాండ్ (బోర్డర్‌లెస్ ఫౌండేషన్) దేశాలకు చెందిన 11 మంది అంతర్జాతీయ ప్రతినిధుల బృందం గత మూడు రోజులుగా ఏలూరు జిల్లాలో పర్యటిస్తోంది.

పర్యటనలో చివరి రోజైన బుధవారం ఈ బృందం ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలోని పలు గ్రామాలను సందర్శించింది:గోకినేపల్లి గ్రామంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్ స్వంత పొలంలో సాగు చేస్తున్న 5 రకాల దేశీ వరిరకాలను,ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు.అనంతరం కొప్పాకగూడెం గ్రామంలోని రైతు కళా చంద్రరావు సాగు చేస్తున్న కూరగాయల మోడల్‌ను సందర్శించారు.అమ్మపాలెం గ్రామంలో రైతు రంగయ్య తోటలోని 5-లేయర్ల ఉద్యానవన పంటల (కొబ్బరి,కోకో, వక్క, పసుపు,కంద తదితర) సమగ్ర సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ జేడీ షేక్ హబీబ్ భాషా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణపై ప్రతినిధులతో చర్చించారు.జిల్లాలో అమలువుతున్న ప్రకృతి వ్యవసాయ తీరుపై అంతర్జాతీయ బృందం ప్రత్యేక హర్షం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం షేక్ మహబూబ్ వలీ,సిబ్బంది నవీన,పద్మనాభం మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్