Eluru: వ్యవసాయాభివృద్ధి ద్వారా జిల్లా జీడీపీ వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి!

Eluru: వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా జీడీపీ వృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2026 7:00 AM IST
Eluru
X

Eluru: వ్యవసాయాభివృద్ధి ద్వారా జిల్లా జీడీపీ వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి!

Eluru: వ్యవసాయ,అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా జిల్లా జిడిపి వృద్ధికి అవకాశాలను పరిశీలించి ప్రణాళికలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

ఏలూరు కలెక్టరేట్లో బుధవారం అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులు,జిల్లా అధికారులతో జిల్లాలో అమరావతి ఎకనామిక్ రీజియన్ ప్రణాళికపై ఇంచార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డా.అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యవసాయ ప్రధానమైన జిల్లా అని,వ్యవసాయ,అనుబంధరంగాల అభివృద్ధి ద్వారా జిల్లా జిడిపి వృద్ధి రేటు ప్రభావితం అయ్యేలా తీసుకోవలసిన చర్యల పై వ్యవసాయ,అనుబంధ రంగాల రైతులు,పారిశ్రామికవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో వారి సూచనలు,వారి సమస్యలు తెలుసుకుని, వ్యవసాయ, అనుబంధ రంగాలలో మరింత అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు,రైతులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు,తదితర అంశాలను చర్చించాలన్నారు.

అమరావతి ఎకనామిక్ రీజియన్ లో జిల్లాలో చేపట్టవలసిన కార్యక్రమాలపై పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను, అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులకు ఇంచార్జ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాస్,జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వెంకటరావు,మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్,అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులు,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్