Polavaram: పోలవరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి!
Polavaram: పోలవరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి ఆర్యవైశ్య స్థూపం వద్ద ఘన నివాళులు అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడని కొనియాడిన నేతలు.
Polavaram: పోలవరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి!
పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు జరిపారు వాసవి క్లబ్ అధ్యక్షులు పెరుమళ్ళ నాగేంద్ర కుమార్ మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమళ్ళ సూర్యనారాయణ మహాత్మా గాంధీ 157 వ జయంతిని స్థానిక ఆర్యవైశ్య స్థూపం దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరై దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు.
అహింసో పరమో ధర్మః సిద్ధాంతంతో తెల్లవారిని తరిమి కొట్టి మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు అటువంటి మహానుభావుని జన్మదినాన్ని జరుపుకునే భాగ్యం మనకు ఉండినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కొనియాడారు ఈ కార్యక్రమంలో చెక్క వెంకటేశ్వరరావు, చెక్క గోపి, దుర్గారావు నంబూరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




