Eluru: డిసెంబర్ 23న ముసాయిదా, ఫిబ్రవరి 2న తుది ఓటరు జాబితా విడుదల!

Eluru: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితాల ప్రత్యేక పునఃతయారీ ప్రక్రియ కొనసాగుతోందని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 2న తుది జాబితా విడుదల కానుంది.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 29 Nov 2026 5:12 PM IST
Eluru
X

Eluru: డిసెంబర్ 23న ముసాయిదా, ఫిబ్రవరి 2న తుది ఓటరు జాబితా విడుదల!

Eluru: ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి మరియు కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల ప్రత్యేక పునఃతయారీ ప్రక్రియ కొనసాగుతోందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నాటికి,గత ఆరేళ్లలో కనీసం మూడేళ్ల పాటు మాధ్యమిక లేదా ఆపై స్థాయి విద్యాసంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులు ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ఆమె పేర్కొన్నారు.ఇప్పటివరకు తూర్పు–పశ్చిమ గోదావరి నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లాలో 2 వేల 690 దరఖాస్తులు అందగా,2 వేల 434 ఆమోదించబడ్డాయి.

కృష్ణా–గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి 717 దరఖాస్తులకు గాను 467 ఆమోదం పొందాయి.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. దీనిపై డిసెంబర్ 23 నుండి వచ్చే ఏడాది జనవరి 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి,ఫిబ్రవరి 2న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid