Eluru: అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు, అక్టోబరు 5లోపు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
Eluru: అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో జిల్లా కె.వెట్రిసెల్వి సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)అక్టోబరు 05వ గడువు ఉందని,క్లెయిమ్‌లు,అభ్యంతరాలు ఉంటే దాఖలు తీసుకోవచ్చునని అన్నారు.సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు,సందేహాలను జిల్లా కలెక్టరు నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ క్లెయిమ్‌లు,అభ్యంతరాలు ఏమైనా ఉంటే అర్హులైన పౌరులు,పార్టీ ప్రతినిధులు అక్టోబరు 05వ తేదీ లోపు సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని అన్నారు.వచ్చిన ధరఖాస్తులు,అభ్యంతరాలను నిబంధనలు ప్రకారం పరిష్కరించడం జరుగుతుందన్నారు.
అక్టోబరు 09వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.ఎలాంటి తప్పుల్లేని,పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులు తమవంతు సహకారాన్ని అందించాలని అన్నారు.
క్షేత్రస్థాయిలో బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్చి జిల్లా రెవెన్యూ అధికారి,ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి,వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు,ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.




