Velerupadu: రుద్రంకోటలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌పై క్షేత్రస్థాయి అవగాహన!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట పంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌పై క్షేత్రస్థాయి అవగాహన సందర్శన.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 8 Oct 2026 11:44 AM IST
Velerupadu
X

Velerupadu: రుద్రంకోటలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌పై క్షేత్రస్థాయి అవగాహన!

Velerupadu: మండల పరిధిలోని రుద్రంకోట గ్రామ పంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌పై క్షేత్రస్థాయి అవగాహన సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఎం. శ్రీహరి, డిప్యూటీ ఎంపీడీవో బి. దావీదు ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

వర్మీ కంపోస్ట్ తయారీ, తడి–పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ విధానాలను సిబ్బంది ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి పంచాయతీలో నెలకు ఒక టన్ను వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. 9 పంచాయతీల క్లాప్ మిత్రులు నాడేపిట్లు, వర్మీ పిట్లను పరిశీలించి కంపోస్ట్ ఉత్పత్తి మెరుగుపరిచే విధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్శన తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని క్లాప్ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR