Chintalapudi: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: జేసీ!

Chintalapudi: చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పెండింగ్ భూసేకరణ, రైతుల పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఏలూరు జేసీ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 16 Nov 2026 9:55 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: జేసీ!

చింతలపూడి: చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాన కాలువ తవ్వకాలకు అవసరమైన పెండింగ్ భూసేకరణ,రైతులకు పరిహారం చెల్లింపులు,భూముల బదలాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.

ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి పథకమని,నిర్ణీత గడువులో భూసేకరణ పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓలు, భూసేకరణ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid