Eluru: నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు, క్రిమినల్ కేసులు!
Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్. డ్రై డేస్ ఉత్తర్వులను జారీ చేసిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనాల ఆవులయ్య.
Eluru: నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు, క్రిమినల్ కేసులు!
Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల మేరకు ముందస్తుగా మద్యం దుకాణాలు,బార్లు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనాల ఆవులయ్య ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 30 సాయంత్రం 5:00 గంటల నుండి నవంబర్ 01 పోలింగ్ ముగిసేవరకు,అలాగే నవంబర్ 03న ఓట్ల లెక్కింపు ముగిసేవరకు ఏలూరు,జంగారెడ్డిగూడెం, నూజివీడు పట్టణాలు,వాటి 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం షాపులు పూర్తిగా బంద్ ఉంటాయని తెలిపారు.
అదేవిధంగా, ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి నవంబర్ 03 సాయంత్రం 5:00 గంటల నుండి నవంబర్ 05 పోలింగ్ ముగిసేవరకు, మళ్లీ నవంబర్ 07 కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలన్నారు.నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా,విక్రయించినా,రవాణా చేసినా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి,షాపు లైసెన్సులు రద్దు చేస్తామని ఆవులయ్య హెచ్చరించారు.




