Kukunoor: కుక్కునూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం తెల్లం బాలరాజు!

Kukunoor: కుక్కునూరులో వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దిశానిర్దేశం. ఐదేళ్ల ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 13 Oct 2026 5:47 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం తెల్లం బాలరాజు!

కుక్కునూరు: మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ఆవరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నియోజకవర్గ అబ్జర్వర్ శివాజీ రాజు లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీలను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం కుక్కునూరు, గణపవరం పంచాయతీలకు చెందిన పలువురు కార్యకర్తలకు తెల్లం బాలరాజు, తాండ్ర రాజేష్ పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR