Eluru: విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: ఏలూరు ఎస్పీ

Eluru: రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పలు శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 7:11 PM IST
Eluru
X

Eluru: విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: ఏలూరు ఎస్పీ

ఏలూరు జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల బస్సు ప్రమాదంలో 16 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన నేపథ్యంలో విద్యార్థుల రవాణాకు అదనపు బస్సుల ఏర్పాటు, వాహనాల కండిషన్,డ్రైవర్ల బాధ్యతాయుతమైన డ్రైవింగ్, వేగ నియంత్రణ, బస్సు షెల్టర్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు.

ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీసులు, ఆర్టీసీ, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, రవాణా, పోలీస్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్