Eluru: ఏలూరులో ‘సురక్షితమైన బాల్యం - నిరంతర విద్య’ సదస్సు
Eluru: ఏలూరులో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్, చైల్డ్‌ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సురక్షితమైన బాల్యం - నిరంతర విద్య’పై వర్క్‌షాప్ నిర్వహించారు.
Eluru: ఏలూరులో ‘సురక్షితమైన బాల్యం - నిరంతర విద్య’ సదస్సు
Eluru: ఏలూరులో సెమినార్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్,చైల్డ్ ఫండ్ ఇండియా,మరియు ఒలం ఫుడ్ ఇగ్రిడియన్స్ సంయుక్త ఆధ్వర్యంలో "సురక్షితమైన బాల్యం - నిరంతర విద్య" అనే అంశంపై సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పిల్లల స్థితిగతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, బాల స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలన్నారు.
స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి ‘నీడ్ బేస్డ్ అసెస్మెంట్’ ద్వారా పిల్లల వైద్య,విద్య,రక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒలం ఫుడ్ ఇగ్రిడియన్స్ జీఎం కలువ శ్రీధర్, చైల్డ్ ఫండ్ ఇండియా మేనేజర్ రాకేష్ కుమార్,ఐసీడీఎస్ పీడీ శారద,డీసీపీఓసూర్య చక్రవేణి,డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాస్,చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




