Eluru: ఏలూరు పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి!

Eluru: ఏలూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు మంత్రిని కలిశారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 19 Nov 2026 3:17 PM IST
Eluru
X

Eluru: ఏలూరు పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి!

ఏలూరు: విజయవాడ తాడిగడప మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ​రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఏలూరు నగరపాలకసంస్థ మేయర్ అభ్యర్థిగా గెలుపొందిన రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను,ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.

ఏలూరు పట్టణ ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడంతో పాటు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కూటమిప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన పట్టణ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు కూటమిప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

నగరంలో దెబ్బతిన్న రోడ్లపునర్నిర్మాణం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటు పనులను వేగవంతం చేయ్యాలని సూచించారు. నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన తాగునీటి పైప్‌లైన్లు, ప్రాజెక్టులు విస్తరణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ప్రజాసంక్షేమం పారదర్శతతో ప్రజాసమస్యలు పరిష్కారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకుంటూ, ఏలూరును ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుటకు సమిష్టిగా కృషిచేద్దామని మంత్రి భరోసానిచ్చారు.​ ఈ కార్యక్రమంలో కూటమిపార్టీ శ్రేణులు, పట్టణముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid