Eluru: రామచంద్రపేట పార్క్‌లో స్వచ్ఛతా హి సేవా చేపట్టిన యూనియన్ బ్యాంక్
Eluru: ఏలూరులో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహించి, పార్క్‌ను శుభ్రపరిచారు.
Eluru: రామచంద్రపేట పార్క్‌లో స్వచ్ఛతా హి సేవా చేపట్టిన యూనియన్ బ్యాంక్
ఏలూరు: ఏలూరులో యూనియన్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రామచంద్రరావుపేటలోని ఎన్టీఆర్ మునిసిపల్ పార్క్లో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పార్క్‌ను శుభ్రపరిచి,పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కార్యాలయం నుంచి పార్క్ వరకు “స్వచ్ఛత మన అందరి బాధ్యత” అనే నినాదాలను పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ ఎన్.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ సత్యనారాయణ రెడ్డి యూనియన్ బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె.సత్యనారాయణ,మరియు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.




