Eluru: ఏకలవ్య గురుకులాల్లో త్వరలోనే స్పోర్ట్స్ మీట్ కార్యదర్శి గౌతమి
Eluru: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ఏకలవ్య పాఠశాలలను తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.గౌతమి. 28 EMRS పాఠశాలలకు స్పోర్ట్స్ మీట్ నిర్వహణ.
Eluru: ఏకలవ్య గురుకులాల్లో త్వరలోనే స్పోర్ట్స్ మీట్ కార్యదర్శి గౌతమి
ఏలూరు: రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (EMRS) చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు,వివిధ రకాల ఆటల పోటీలలో నైపుణ్యం పెంపొందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శి ఎం.గౌతమి పేర్కొన్నారు.శుక్రవారం ఏలూరు జిల్లా పరిధిలోని జీలుగుమిల్లి,బుట్టాయగూడెం గ్రామాలలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆమె ఆకస్మికంగా సందర్శించి,పరిశీలించారు.
పాఠశాలలోని వసతులు, విద్యా బోధన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కార్యదర్శి ఎం.గౌతమి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం త్వరలోనే ఒక ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ (క్రీడోత్సవం) నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ తమ ప్రతిభను కనబరిచేలా ఈ పోటీలు దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యే రీతిలో, అవసరమైతే ఒకటి కి రెండు సార్లు స్పష్టంగా విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహార మెనూను పక్కాగా అమలు చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు.విద్యార్థుల ఆరోగ్యం,వసతుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,గిరిజన సంక్షేమ శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.




