Eluru: స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరి: డీటీసీ షేక్ కరీమ్

Eluru: స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఏలూరు డీటీసీ షేక్ కరీమ్ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 5:57 PM IST
Eluru
X

Eluru: స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరి: డీటీసీ షేక్ కరీమ్

ఏలూరు జిల్లా: విద్యాసంస్థల బస్సుల నిర్వహణలో రవాణా శాఖ నిబంధనలు,విద్యార్థుల భద్రత తప్పనిసరి అని ఉప రవాణా కమిషనర్ (డైరెక్టర్/డీటీసీ) షేక్ కరీమ్ అన్నారు. ప్రతి విద్యాసంస్థ బస్సు కచ్చితంగా నిర్ణీత కాలపరిమితిలో ఫిట్‌నెస్,పర్మిట్,ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.

బ్రేకులు, టైర్లు, స్టీరింగ్, వైపర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి అని డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండాలి అని క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి అని మద్యం, మత్తు పదార్థాలు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకంపై కఠిన నిషేధం అని ప్రతి బస్సులో VLTD (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్),డ్యాష్‌బోర్డ్ కెమెరాలు,ఫస్ట్ ఎయిడ్ బాక్స్,అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్స్‌టింగిషర్), అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఉండాలి అని అన్నారు.

బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదు అని ప్రయాణ సమయంలో తలుపులు,కిటికీల వద్ద విద్యార్థులు జాగ్రత్తగా ఉండేలా సిబ్బంది పర్యవేక్షించాలి అని జిల్లాలో నెలకు 30 నుంచి 40 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఉప రవాణా కమిషనర్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎస్.బి.శేఖర్, తనిఖీ అధికారులు విఠల్, రమేష్ బాబు, ప్రసాదరావు, నెహ్రు మరియు 150 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్