Eluru: కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఏలూరు ఎస్పీ!
Eluru: ఏలూరు జిల్లాలో 23 జెడ్పీటీసీ, 408 ఎంపీటీసీ స్థానాల పోలింగ్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
Eluru: కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఏలూరు ఎస్పీ!
Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు,జంగారెడ్డిగూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో నేడు జరుగుతున్న 23 జడ్పీటీసీ,408 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల పోలింగ్‌ను జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా ఎన్నికల నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వివిధ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా (Live) పరిశీలిస్తూ,క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు,సిబ్బందికి ఎస్పీ ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుమిగూడకుండా నియంత్రించాలని,సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
ప్రతి ఓటరు ఎటువంటి భయం,ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛా వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించేలా చూడాలని, నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు."ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది.జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది"అని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తెలియజేశారు.




