Eluru: తుఫాన్ హెచ్చరికలు: ఏలూరు ఎస్పీ కీలక సూచనలు!

Eluru: ఏలూరు జిల్లాలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సహాయక శిబిరాలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Oct 2026 3:38 PM IST
Eluru
X

Eluru: తుఫాన్ హెచ్చరికలు: ఏలూరు ఎస్పీ కీలక సూచనలు!

Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు లోతట్టు ప్రాంతాలు,పూరి గుడిసెలు, రేకుల ఇళ్లు,శిథిలావస్థ భవనాల్లో ఉండేవారు తక్షణమే ప్రభుత్వ తుఫాన్ సహాయక శిబిరాలకు వెళ్లాలి అని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కోరారు.

ఇంట్లో తాగునీరు,మందులు,టార్చ్ లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలి అని మొబైల్ ఫోన్లు,పవర్ బ్యాంకులు పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలి అని తెగిపడిన కరెంట్ తీగలు,స్తంభాలకు దూరంగా ఉండాలి అని బలమైన గాలులు వీచేటప్పుడు ఇంటి పైకప్పులపైకి ఎక్కకూడదు అని తుఫాన్ వల్ల ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే డయల్ 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు అని వాతావరణ శాఖ,అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండాలని ఎస్పీ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్