Eluru: క్యూఆర్ కోడ్‌తో పీజీఆర్‌ఎస్‌పై స్పందన: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: పీజీఆర్‌ఎస్ సేవల నాణ్యత, సంతృప్తి స్థాయిని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రేటింగ్ రూపంలో తెలియజేయాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు.
Eluru: క్యూఆర్ కోడ్‌తో పీజీఆర్‌ఎస్‌పై స్పందన: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా అందిన సేవలపై ప్రజలు తమ స్పందనను, సంతృప్తి స్థాయిని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా తెలియజేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు.ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు.
జిల్లా,మండల స్థాయి పిజిఆర్ఎస్ కేంద్రాల ప్రవేశ,నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఈ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.సేవలు పొందిన అర్జీదారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేసి రేటింగ్ లేదా అభిప్రాయాలను నమోదు చేయవచ్చని,ఈ సమాచారం నేరుగా అధికారిక పోర్టల్‌కు చేరుతుందని వివరించారు.
అలాగే అర్జీల స్థితిగతులను తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.ప్రజలంతా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఉపయోగించి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.




