Eluru: జిల్లా కారాగారంలో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
Eluru: ఏలూరు జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జడ్జి ఇందిరాప్రియదర్శిని, కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Eluru: జిల్లా కారాగారంలో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
ఏలూరు: ఖైదీలు సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా కారాగారం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి యు.ఇందిరాప్రియదర్శిని మరియు ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖైదీలను ఉద్దేశించి మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి యు.ఇందిరాప్రియదర్శిని మాట్లాడుతూ ఈ కారాగారం ఒక ఆశ్రమం లాంటిదని అన్నారు.పరివర్తన చెంది బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించాలని అన్నారు.తెలిసో తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకునే ఒక ఆశ్రమం లాంటిదని అన్నారు కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని మార్పుచెంది కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఖైదీలు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నను కారాగార సూపర్డెంటు ద్వారా తెలియచేసిన యెడల తక్షణం పరిష్కారంకు కృషిచేస్తామని ఖైదీలకు భరోసా ఇచ్చారు.మెనూ ప్రకారం ఖైదీలకు ఆహారం అందించాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని అన్నారు.
వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, న్యాయ సహాయం,తదితర సౌకర్యాలను కల్పించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చేలా యోగా,ధ్యానం,వ్యాయాయం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.తదనంతరం ఆటలు,పాటలు పోటీల్లో గెలిచిన ఖైదీలకు బహుమతి ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి,జిల్లా కారాగార సూపర్డెంటు నరసింహారెడ్డి, జైలు,పోలీసు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.




