Eluru: ఏలూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏసీబీ సోదాలు!
Eluru: ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సోదాలు. ఈఈ సీతారామచంద్రమూర్తి జారీ చేసిన అనుమతులపై అధికారుల ముమ్మర తనిఖీలు.
Eluru: ఏలూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏసీబీ సోదాలు!
ఏలూరు: ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు కొనసాగుతున్నాయి.ఈ నెల 6వ తేదీన, గోడౌన్ నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పర్యావరణ పరిరక్షణ శాఖ ఈఈ (EE) సీతారామచంద్రమూర్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
అనంతరం ఆయన ఇంట్లో జరిపిన తనిఖీల్లో లెక్కల్లో చూపని 18 లక్షల 73 వేల రూపాయల నగదు11 కాసుల బంగారం లభ్యమయ్యాయి. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో సదరు అధికారి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జారీ చేసిన అన్ని అనుమతులు,ధ్రువీకరణ పత్రాలపై ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు ప్రాంతీయ కార్యాలయంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి.




