Eluru: ఏలూరు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: నవంబర్ 26న తొలి విడత గ్రామ పంచాయతీ, చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు ఏలూరులో ఏర్పాట్లు పూర్తి; ఎస్ఈసి అనిల్ చంద్ర పునేఠా సమీక్ష.
Eluru: ఏలూరు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు: ఈ నెల 26న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏలూరు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసి) అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన జూమ్ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఈసి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని,కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.




