Eluru: ఏలూరు కలెక్టర్కు ఫారం-A పత్రాల అందజేత
Eluru: ఏలూరు జిల్లాలో నగరపాలక, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ కె.వెట్రిసెల్వికి ఫారం-A పత్రాలు అందజేశారు.
Eluru: ఏలూరు కలెక్టర్కు ఫారం-A పత్రాల అందజేత
ఏలూరు: ఏలూరు జిల్లాలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎంపిపి ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు సంబంధించి పలు రాజకీయ పార్టీల అధినేతలు వారికి చెందిన అభ్యర్థులకు జారీ చేసే బి-ఫారం పత్రాలను జారీ చేసే అధికారిక ప్రతినిధిలేఖలు ఫారం-A ను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు శనివారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి అందజేశారు. సదరు లేఖలలో తెలియజేసిన సిఫారస్తు చేస్తూ జారీ చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.




