Eluru: కేతవరంలో పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల అవగాహన సదస్సు!

Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో ప్రశాంత ఎన్నికలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 9:35 PM IST
Eluru
X

Eluru: కేతవరంలో పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల అవగాహన సదస్సు!

ఏలూరు: ఏలూరు జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు,జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్,ఎస్సై వీరప్రసాద్ సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ గ్రామస్థులు,ముఖ్యంగా యువత ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా,స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించినా లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అసాంఘిక శక్తులు ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.గ్రామంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా,ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేతవరం గ్రామ పెద్దలు,ప్రజలు ఈ సందర్భంగా అధికారులకు హామీ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్