Eluru: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: 39 ఫిర్యాదుల స్వీకరణ
Eluru: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, 39 ఫిర్యాదులను స్వీకరించారు.
Eluru: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: 39 ఫిర్యాదుల స్వీకరణ
ఏలూరు: ప్రజల సమస్యలను వేగంగా,నిష్పక్షపాతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,అదనపు ఎస్పీ వై.ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 39 ఫిర్యాదులు స్వీకరించారు.భూ వివాదాలు,కుటుంబ తగాదాలు,ఆర్థిక మోసాలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత అధికారులతో సమీక్షించి,నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రజలు తమ సమీప సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందించవచ్చని,మీకోసం పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.




