Eluru: అర్నాబ్ తుఫాను ముప్పు ఏలూరు జిల్లాలో పోలీసుల మైక్ అనౌన్స్‌మెంట్‌లు!

Eluru: అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లాలో పోలీసుల ముందస్తు చర్యలు. గొగుంట గ్రామంలో మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు, సేఫ్టీ టిప్స్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Oct 2026 3:20 PM IST
Eluru
X

Eluru: అర్నాబ్ తుఫాను ముప్పు ఏలూరు జిల్లాలో పోలీసుల మైక్ అనౌన్స్‌మెంట్‌లు!

Eluru: రానున్న 'అర్నాబ్' తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు,పెదవేగి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదవేగిలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పెదపాడు ఎస్ఐ. ఆర్.శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పెదపాడు మండలంలోని గొగుంట గ్రామంలోని లోతట్టు ప్రాంతాలలో మైక్ అనౌన్స్‌మెంట్ నిర్వహించారు.

తుఫాను ప్రభావం,రానున్న భారీ వర్షాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు మైక్ ద్వారా వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటికి రావద్దని,లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.గ్రామంలో ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 నెంబర్‌కు గానీ, లేదా పోలీసు వాట్సాప్ నెంబర్ 9550351100 కు గానీ సమాచారం అందించి రక్షణ పొందవచ్చని ప్రజలకు భరోసా కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్