Eluru : ఇళ్లలోకి వరదనీరు.. చెరువులను తలపిస్తున్న నివాసాలు!

Eluru : ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం జగన్నాధపురంలో డ్రైనేజీ పూడికతో ఇళ్లలోకి చేరిన వరద నీరు: చెరువులను తలపిస్తున్న నివాసాలు, పట్టించుకోని అధికారులపై బాధితుల ఆగ్రహం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 24 Sept 2026 5:41 PM IST
Eluru
X

Eluru : ఇళ్లలోకి వరదనీరు.. చెరువులను తలపిస్తున్న నివాసాలు!

ఏలూరు: వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము పంచాయతీ పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో డ్రైనేజీ కాలువ పూడుకుపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. దీంతో నాలుగు ఇళ్లు వరదనీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

డ్రైనేజీ సమస్యపై పంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి తడిసిపోతున్నాయని, చిన్నారులు, వృద్ధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడుకుపోయిన డ్రైనేజీ కాలువను శుభ్రం చేసి, వరదనీరు ఇళ్లలోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత కుటుంబాలు, గ్రామస్తులు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR