Eluru: మార్చి 2027 నాటికి అందరికీ పాస్ పుస్తకాలు కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో మార్చి 2027 నాటికి రైతులందరికీ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సింగవరంలో పంపిణీ.
Eluru: మార్చి 2027 నాటికి అందరికీ పాస్ పుస్తకాలు కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు: మార్చి 2027లోగా ఏలూరు జిల్లాలోని రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.దెందులూరు మండలం సింగవరంలో గురువారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేసారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేకుండా,13 పటిష్టమైన భద్రతా ఫీచర్లతో పట్టా దారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
మార్చి 2027లోగా జిల్లాలోని రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతీ నెల 20 నుండి 30 గ్రామాలలో రీసర్వే పనులను పూర్తిచేసి,తదుపరి నెలలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు అందిస్తున్నామన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో చేపట్టిన భద్రతా ఫీచర్స్ కారణంగా నకిలీ పాస్ పుస్తకాలను రూపొందించడం,జిరాక్స్ కూడా తీసేందుకు కుదరదన్నారు.
పుస్తకంలోని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే రైతు పేరు,ఆస్తివివరాలు,భూమి మ్యాప్ అన్ని తెలుస్తాయన్నారు.ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా వీలులేకుండా భద్రత కల్పించామన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకంలో రైతు పేరు,తండ్రిపేరు,విస్తీర్ణం, సర్వే నెంబర్,భూమి ఉన్న ప్రదేశం మ్యాప్, తదితర వివరాలన్నీ పొందుపరచడం జరిగిందన్నారు.పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకునే సమయంలో వివరాలలో ఏదైనా తప్పులు ఉంటె తీసుకోవద్దని,సరైన వివరాలు తెలియజేస్తే,సరిచేసి ఇస్తామన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎటువంటి తప్పులేని,రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పాస్ పుస్తకాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతను తెలుసుకుని పట్టాదార్ పాస్ పాస్ పుస్తకాల పంపిణీని జిల్లా యంత్రాంగం నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న,తహసీల్దార్ సుమతి,దెందులూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత,సీతంపేట బ్యాంక్ అధ్యక్షుడు యలమర్తి శ్రీనివాస్,మండల అధ్యక్షుడు నాగన్న బోయిన సత్యనారాయణ,స్థానిక ప్రముఖులు పరసా వెంకట్రావు,పర్వతనేని రామకృష్ణ,బోడ్డేటి మోహన్ బాబు,ప్రభృతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సింగవరం పరిధిలో రెండు ఎకరాల ప్రభుత్వము ఉందని దాన్ని కొంతమంది ఆక్రమించారని పర్వతనేని రామకృష్ణ జిల్లా కలెక్టర్ దృష్టికి తేవడంతో దాని విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.




