Eluru: ఆయిల్ పామ్‌లో అంతర పంటలతో అధిక ఆదాయం!

Eluru: ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు, అంతర పంటల ద్వారా ఎకరాకు రూ.3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎం.కె.వి.శ్రీనివాసులు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 10:09 PM IST
Eluru
X

Eluru: ఆయిల్ పామ్‌లో అంతర పంటలతో అధిక ఆదాయం!

ఏలూరు: ఏలూరు జిల్లాలో 2 లక్షల నాణ్యమైన విత్తనోత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం.కె.వి.శ్రీనివాసులు ఉద్యానవన శాఖ అధికారులు,సిబ్బందిని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ అంతర పంటల ప్రోత్సాహకం పై పెదవేగి మండలం,గోపన్నపాలెం ఆయిల్ పామ్ విత్తనోత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ IOPR శాస్త్రవేత్తల సలహాలు సూచనలు అనుసరిస్తూ 2 లక్షల నాణ్యమైన విత్తనోత్పత్తి లక్ష్యంగా శగా అధికారులు,సిబ్బంది పనిచేయాలన్నారు. కామవరపుకోట మండలం రత్నగిరి నగర్, ఇంజినీర్ ప్రసాద్ మోడల్ ఫార్మ్ విధానాన్ని పరిశీలించి రైతులకు ఈ మోడల్ ఫార్మ్ వలన వచ్చే లాభలను ఆచరణ విదానంలో ఎకరాకు 3 లక్షల ఆదాయము వచ్చే విదముగా అవకాశము ఉందని తెలియజేశారు.

అనంతరం ఏపి ఆయిల్ ఫెడ్ నర్సరీ ను సందర్శించి నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలని సిబ్బంది కి సూచించారు.పెదవేగి IIOPR రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్. కే.కాళిదాసు తమ సూచనలు పురుగు తెగుళ్ళు ఆశించే విధానాన్ని నివారణ చర్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఉద్యానవన శాఖ ఏలూరు ఉప సంచాలకులు కే.సాజా నాయక్,ఉద్యాన అధికారులు పెదవేగి మరియు ద్వారకా తిరుమల మరియు గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్