Nuzvid: నెక్కలం గొల్లగూడెంలో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థి కాజా శివకుమారి, 12 మంది వార్డు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
Nuzvid: నెక్కలం గొల్లగూడెంలో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు!
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాజా శివకుమారి మరియు 12 మంది వార్డు సభ్యులు రాత్రింబవళ్లు తేడా లేకుండా గడపగడపకు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, గ్రామ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాజా శివకుమారి భర్త కాజా చిన్న కుటుంబరావు మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు.పార్థసారథి ఆశీస్సులతో ఆగిరిపల్లి మండలం ఇప్పటికే అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నెక్కలం గొల్లగూడెం గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అన్ని వర్గాల ప్రజలు ఏకమై సర్పంచ్ అభ్యర్థి కాజా శివకుమారితో పాటు 12 మంది వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
గ్రామంలో ఎవరికి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, అందరం కలిసికట్టుగా మంత్రి పార్థసారథి సహకారంతో ఆ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని నేరుగా కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, గ్రామంలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీ మరియు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.




