Nuzvid: కొత్తగూడెం పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా గొడవర్తి దేవమాత!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మంత్రి కొలుసు పార్థసారథి ఆశీస్సులతో గొడవర్తి దేవమాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Nuzvid: కొత్తగూడెం పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా గొడవర్తి దేవమాత!
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.మంత్రి కొలుసు పార్థసారథి ఆశీస్సులతో కూటమి తరఫున బరిలో నిలిచిన గొడవర్తి.దేవమాత సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రామ ఐక్యతే లక్ష్యంగా,రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు,గ్రామ పెద్దలు,ప్రజలు దేవమాత అభ్యర్థిత్వానికి మద్దతు పలకడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.మండలంలోనే తొలి ఏకగ్రీవ పంచాయతీగా కొత్తగూడెం నిలిచింది.పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని,గ్రామ అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన సర్పంచ్ కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.




