Nuzividu: కూటమితోనే ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి: మంత్రి కొలుసు!
Nuzividu: నూజివీడు 14వ వార్డులో నిర్వహించిన మాదిగ ఆత్మీయ కలయిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వర్ల రామయ్య పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Nuzividu: కూటమితోనే ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి: మంత్రి కొలుసు!
నూజివీడు: ఎస్సీ,ఎస్టీ కుటుంబాలు అన్నిరంగాల్లో ఆర్థికంగా ఎదగడం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించిన "నూజివీడు మాదిగ ఆత్మీయ కలయిక" సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్య,ఉద్యోగ,రాజకీయ రంగాల్లో దళితులకు అగ్రతాంబూలం ఇచ్చిన ఘనత కూటమిదేనని స్పష్టం చేశారు.
నూజివీడు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి బలపరిచిన చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజాతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సభలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ మాదిగ సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేసి ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని,తుఫాను విపత్తుల్లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా కాపాడిన సీఎం చంద్రబాబు అపార అనుభవ పాలనకు ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రిమిషన్ వైస్-చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కూటమి నాయకులు,మాదిగ సంఘాల పెద్దలు,భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




