Eluru: ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు!

Eluru: ఏలూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పన్నుల వసూళ్ల దుర్వినియోగం ఆరోపణలపై డీఎస్పీ జి.వి. కృష్ణారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి రూ.1.30 కోట్ల అవకతవకలను నిర్ధారించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 18 Nov 2026 12:27 PM IST
Eluru
X

Eluru: ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు!

ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పన్నుల వసూళ్ల దుర్వినియోగం ఆరోపణల పై మంగళవారం ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో సిబ్బందిని విచారించి, రికార్డులను పరిశీలించారు.

ఈ ప్రాథమిక విచారణలో రూ.1.30 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించారు. పూర్తి స్థాయి నిధుల దుర్వినియోగం,బాధ్యులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, బాలకృష్ణ,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid