Eluru: ఏలూరులో నవంబర్ 30న మెగా జాబ్ మేళా.. 1075కి పైగా ఉద్యోగాలు!

Eluru: ఏలూరు అశోక్ నగర్‌లోని కె.పి.డి.టి హైస్కూల్‌లో నవంబర్ 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 20కి పైగా కంపెనీల ద్వారా 1075 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 25 Nov 2026 3:06 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో నవంబర్ 30న మెగా జాబ్ మేళా.. 1075కి పైగా ఉద్యోగాలు!

Eluru: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ సోమవారం ఏలూరు అశోక్ నగర్‌లోని కె.పి.డి.టి హైస్కూల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.20కి పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళా ద్వారా, 1075 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

పదవ తరగతి,ఇంటర్,ఐటిఐ,డిగ్రీ పూర్తి చేసి 18 నుండి 35 ఏళ్ల లోపు వయసున్న వారు ఇందుకు అర్హులు అని అభ్యర్థులు తమ బయోడేటా మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావచ్చు అని మరిన్ని వివరాలకు 8143549464, 8184887146,లేదా 9493482414 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid