Eluru: నిబంధనల ప్రకారమే నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్ వెట్రిసెల్వి!
Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
Eluru: నిబంధనల ప్రకారమే నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్ వెట్రిసెల్వి!
ఏలూరు: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం ఆర్ఓలు,ఏఆర్ఓలు,ఇతర సిబ్బందితో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ రూల్స్ కచ్చితంగా పాటించాలి అని ముందు వచ్చిన వారికి ముందే ప్రాతిపదికన నామినేషన్లు స్వీకరించాలి అని సమయానికి కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి పత్రాలు తీసుకోవాలి అన్నారు.నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించాల్సిన సర్టిఫికెట్లను చెక్ లిస్ట్ ద్వారా సరిచూసుకోవాలి.
ఏవైనా పత్రాలు తక్కువైతే వెంటనే అభ్యర్థులకు సమాచారం అందించాలి అని అక్టోబర్ 23 (శుక్రవారం) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి అని సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే పోలీసులతో చర్చించి డ్రోన్ కెమెరాల నిఘా ఉంచాలి అని ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలి అని ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి,జెడ్పీ సీఈఓ కృష్ణ మోహన్ మరియు ఆర్డీఓలు పాల్గొన్నారు.




