Kukunoor: కుక్కునూరు జెడ్పీటీసీగా జనసేన అభ్యర్థి సరోజినీ నామినేషన్!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ, బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా యర్ణం సరోజినీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 23 Oct 2026 10:53 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు జెడ్పీటీసీగా జనసేన అభ్యర్థి సరోజినీ నామినేషన్!

కుక్కునూరు: జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున యర్ణం సరోజినీ శుక్రవారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, స్థానికంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా జనసేన పార్టీకి చెందిన నాయకుడు కావడంతో మండల అభివృద్ధిపై స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

యర్ణం సరోజినీ ఎన్నికైతే గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందని ఆశిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR